లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కమిటీ డైరెక్టర్‌ కు ఘన సన్మానం

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కమిటీ డైరెక్టర్‌ కు ఘన సన్మానం

ఎడపల్లి మండలంలోని జానకంపేట్ ​శివార్లలో గల ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పాలకమండలి డైరెక్టర్‌గా నియమితులైన జింక లింగం ను బుధవారం తెలంగాణ లోకల్ ఫోర్స్  వ్యవస్థాపక అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా సన్మానించారు. ​ఈ సందర్భంగా డైరెక్టర్ జింక లింగం మాట్లాడుతూ... లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కమిటీ డైరెక్టర్‌గా నియామకమై స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం దక్కడం తన పూర్వజన్మ సుకృతమని సంతోషం వ్యక్తం చేశారు. పాలకవర్గ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ ఆలయ సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ​ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మచ్కూరి గంగాధర్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు దౌర్ రత్నాకర్ రెడ్డి, కిసాన్ ఖేత్ మండల అధ్యక్షుడు శ్రీరామ్ ప్రసాద్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఇరెండ్ల నవీన్, సీనియర్ నాయకులు మైదాం ప్రతాప్ రెడ్డి, రావుట్ల స్వామి గౌడ్, రాజ్ కుమార్, సుధాకర్, చిన్న గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Views: 27
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు