నూతన ఇసుక విధానంపై ట్రాక్టర్ యజమానుల నిరసన

నూతన ఇసుక విధానంపై ట్రాక్టర్ యజమానుల నిరసన

ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఇసుక విధానాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లా సాలూర మండలం మందర్న గ్రామంలో  ట్రాక్టర్ యజమానులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఇసుక వాహనం విధానం వల్ల స్థానిక వాహన యజమానులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, తక్షణమే ఈ నూతన విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతినే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సాలూర ఇన్‌ఛార్జ్ తహశీల్దార్ అనూషను కలిసి తమ ఆవేదనను విన్నవిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. నూతన నిబంధనల వల్ల ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని తమ కుటుంబాలు రోడ్డున పడకముందే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. స్పందించిన తహశీల్దార్ వారి సమస్యలను సావధానంగా విని, ఈ అంశాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్సై మచ్చేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మన ఇసుక వాహనం యాప్ పట్ల అవగాహన పెంచుకుని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుకను యాప్ ద్వారా బుక్కింగ్ చేసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Views: 37
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు