నేడు ఓటర్ జాబితా సవరణ గ్రామసభలు
- ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
By R.Suresh
On
- బోధన్ ఆర్డీవో, ఈఆర్‌ఓ విజయకుమారి
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు బోధన్ ఆర్డీవో, ఎన్నికల నమోదు అధికారి, ఈఆర్‌ఓ విజయకుమారి బుధవారం ప్రకటనలో తెలిపారు. ఓటర్ జాబితాను పారదర్శకంగా రూపొందించడమే లక్ష్యంగా ఈ సభల్లో ముసాయిదా ఓటర్ జాబితాను బహిరంగంగా చదివి వినిపిస్తారన్నారు. మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మారిన వారు, డబుల్ ఎంట్రీలు, గైర్హాజరైన ఓటర్ల వివరాలను సభలో పరిశీలిస్తారన్నారు. ఓటర్లు తమ పేర్లలో తప్పులు, మార్పులు చేర్పులు ఉంటే అక్కడికక్కడే అధికారుల దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు. సభల్లో బీఎల్వోలు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొంటారని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Views: 3
Tags:
About The Author
Latest News
30 Aug 2026 11:48:35
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త):
ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్...

