సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా పూజారి లింగం

సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా పూజారి లింగం

బోధన్ పట్టణంలో 2026-27 సంవత్సరానికి గాను సార్వజనిక్ గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నూతన ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక శ్రీ ఏకచక్రేశ్వర శివాలయ ప్రాంగణంలో గ్రామ ప్రముఖుల ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా పూజారి లింగం, ప్రధాన కార్యదర్శిగా సందీప్, కోశాధికారిగా నంద్యాల శ్యామ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ... గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని తెలిపారు. సెప్టెంబర్ 14న సోమవారం శివాలయంలో సార్వజనిక్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ఉత్సవాల్లో ప్రజలు, భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

 

Views: 16
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు