హున్స పాఠశాలకు సైన్స్ ల్యాబ్ మంజూరు

ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి గ్రామస్థుల కృతజ్ఞతలు

హున్స పాఠశాలకు సైన్స్ ల్యాబ్ మంజూరు

సాలూర మండలం హున్స మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణం, ప్రయోగ పరికరాల కొనుగోలుకు సమగ్ర శిక్షా అభియాన్ కింద రూ. 26 లక్షలు మంజూరయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఈ.నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేసినట్లు గ్రామ సర్పంచ్ మర్కల్ శివకుమార్ బుధవారం వెల్లడించారు. ల్యాబ్ ఏర్పాటుకు పాఠశాలను ఎంపిక చేయించడమే కాకుండా, నిధుల మంజూరుకు ప్రత్యేక కృషి చేసిన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన గ్రామస్తుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సైన్స్ ల్యాబ్ అందుబాటులోకి వస్తే గ్రామీణ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పాఠ్యాంశాలను కేవలం సిద్ధాంత పరంగా కాకుండా ప్రయోగాత్మకంగా బోధించడం వల్ల విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి, జిజ్ఞాస పెరుగుతాయని సర్పంచ్ పేర్కొన్నారు.

Views: 26
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు