శ్రీ విద్యా సాయి పాఠశాలలో ఘనంగా రాఖీ వేడుకలు
కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాలలో గురువారం రాఖీ పౌర్ణమి వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులు సమాజ రక్షణ, సేవల్లో నిరంతరం శ్రమిస్తున్న వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మరియు కార్మికులను నేరుగా కలిసి వారి సేవలను కొనియాడారు. అనంతరం వారికి రాఖీలు కట్టి ఆశీస్సులు తీసుకున్నారు.
గ్రామ సర్పంచ్‌తో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది, పోలీస్ అధికారులు, తపాలా (పోస్టాఫీస్) సిబ్బంది, 108 అంబులెన్స్ ఉద్యోగులు, అటవీ శాఖ (ఫారెస్ట్) అధికారులను విద్యార్థులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థినులు తోటి విద్యార్థులకు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాలలో గురువారం రాఖీ పౌర్ణమి వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులు సమాజ రక్షణ, సేవల్లో నిరంతరం శ్రమిస్తున్న వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మరియు కార్మికులను నేరుగా కలిసి వారి సేవలను కొనియాడారు. అనంతరం వారికి రాఖీలు కట్టి ఆశీస్సులు తీసుకున్నారు. గ్రామ సర్పంచ్‌తో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది, పోలీస్ అధికారులు, తపాలా సిబ్బంది, 108 అంబులెన్స్ ఉద్యోగులు, అటవీ శాఖ అధికారులను విద్యార్థులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థినులు తోటి విద్యార్థులకు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

