డ్రైవర్ల చూపు మెరుగైతేనే ప్రమాదాలకు చెక్ : సీపీ సాయి చైతన్య

నిజామాబాద్‌లో ఘనంగా “అరైవ్ అలైవ్ – 2026” రెండో దశ ప్రారంభం

డ్రైవర్ల చూపు మెరుగైతేనే ప్రమాదాలకు చెక్ : సీపీ సాయి చైతన్య

డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు.. కళ్లజోళ్ల పంపిణీ

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ చేపట్టిన “అరైవ్ అలైవ్ – 2026” కార్యక్రమం రెండో దశ శుక్రవారం నగరంలో ఉత్సాహంగా ప్రారంభమైంది. స్థానిక లయన్స్ కంటి ఆసుపత్రి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి మరియు వినికిడి పరీక్షల శిబిరాన్ని జిల్లా పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ప్రారంభించారు.
ప్రయాణికుల భద్రతే డ్రైవర్ల బాధ్యత
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... వాహనం నడిపే డ్రైవర్ల చూపు లేదా వినికిడిలో లోపాలు ఉండటం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్లు ఎప్పటికప్పుడు తమ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత డ్రైవర్లపైనే ఉందని, క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్ ద్వారానే ప్రమాదాలను అరికట్టవచ్చని ఆయన పేర్కొన్నారు.
సమగ్ర పరీక్షలు - ఉచితంగా కళ్లజోళ్ల పంపిణీ
శిబిరంలో భారీ వాహన, ఆటో, అంబులెన్స్ డ్రైవర్లకు వైద్యులు సమగ్రంగా పరీక్షలు నిర్వహించారు. దృష్టి లోపం ఉన్నవారిని గుర్తించి వారికి ఉచితంగా కళ్లజోళ్లు, డ్రాప్స్ మందులను పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్సగా సి.పి.ఆర్ ఎలా చేయాలో వైద్య నిపుణులు ప్రత్యక్షంగా డ్రైవర్లకు ట్రైనింగ్ ఇచ్చారు. అతి వేగం, లేన్ క్రమశిక్షణ పాటించకపోవడం, అలసటతో వాహనాలు నడపడం ప్రాణాంతకమని సీపీ వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు బస్వారెడ్డి, రామ్ చంద్ర రావు, ఏసీపీలు ప్రకాష్, శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, రాజశేఖర్, మస్తాన్ అలీ, ఐరాడ్ మేనేజర్ వర్షా నిహాంత్, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ విశాల్, హరీష్ స్వామి, లయన్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ దీప్తి, అలేఖ్య, వైశాలి, వినోద్ కుమార్పో, లీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Views: 41
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు