అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి : ఎంపీడీఓ బి.నర్సయ్య
By R.Suresh
On
ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి.నర్సయ్య ఆదేశించారు. సోమవారం సాలూర రైతు వేదికలో నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరించడానికే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ప్రజల నుంచి వ్యవసాయ శాఖకు సంబంధించి 2, నీటిపారుదల శాఖకు 1 దరఖాస్తు చొప్పున మొత్తం మూడు వినతులు వచ్చాయన్నారు. వీటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Views: 29
Tags:
About The Author
Latest News
30 Aug 2026 11:48:35
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త):
ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్...

