రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత

సాలూర చెక్ పోస్ట్ వద్ద వాహనదారులకు 'అరైవ్ అలైవ్'పై బోధన్ రూరల్ పోలీసుల అవగాహన

రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత

రహదారి నిబంధనల పట్ల వాహనదారులు ప్రదర్శించే చిన్నపాటి నిర్లక్ష్యం.. కుటుంబాల్లో తీరని వేదన మిగులుస్తుందని బోధన్ రూరల్ పోలీసులు హెచ్చరించారు. ప్రాణవాయువు ఎంత ముఖ్యమో, ప్రయాణంలో భద్రతా నియమాలు అంతే ముఖ్యమని వారు స్పష్టం చేశారు. శుక్రవారం సాలూర మండల కేంద్రం శివారులోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి జందార్ లింగమయ్య మాట్లాడుతూ.. రహదారి భద్రతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు.  ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రమాద సమయాల్లో ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని వివరించారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు, యజమానులపై చట్టపరమైన చర్యలతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దు గుండా వెళ్లే భారీ వాహనదారులు నిబంధనలు పాటిస్తూ, పరిమితికి మించిన వేగంతో వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. నిమిషం అలసత్వం జీవితాంతం విషాదం కాకూడదని పోలీసులు ఈ సందర్భంగా హితవు పలికారు.
Views: 18
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు