సాలురలో పూర్వ విద్యార్థుల సేవాభావం

సాలురలో పూర్వ విద్యార్థుల సేవాభావం

తాము చదువుకున్న ఊరు.. పెరిగిన పరిసరాల మీద మమకారంతో ఆ పూర్వ విద్యార్థులంతా ఒక్కటయ్యారు. తమ వంతు సామాజిక బాధ్యతగా ఆధ్యాత్మిక క్షేత్రానికి వెలుగులు పంచారు. సాలుర మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 2003-2004 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ సేవా గుణాన్ని చాటుకున్నారు.
​స్థానిక ఒంటి హనుమాన్ ఆలయ ప్రాంగణం రాత్రి వేళల్లో చీకటిగా ఉంటున్న విషయాన్ని గమనించిన విద్యార్థులు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎల్లీడి లైట్లను అందజేశారు. 
​విద్యార్థుల సేవా దృక్పథాన్ని ఆలయ నిర్వాహకులు, గ్రామస్థులు ప్రశంసించారు. చిన్ననాటి మిత్రులంతా కలిసి ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని కొనియాడారు. తాము చదువుకుని ప్రయోజకులమైన తర్వాత పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని పూర్వ విద్యార్థులు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు.

 

Views: 53
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు