చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య
By R.Suresh
On
భార్య అనారోగ్యంతో పుట్టింటికి వెళ్లడంతో తీవ్ర మనస్తాపానికి గురై మార్వాడి రాజు (21) అనే యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం...బోధన్ మండలం పెంటాఖుర్దు గ్రామానికి చెందిన రాజు ఆగస్టు 30న రాత్రి ఇంటి నుంచి వెళ్లాడు. మరుసటి రోజు రాత్రి గ్రామంలోని చెరువులో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
Views: 58
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

