సాలూరలో ఘనంగా ఇఫ్తార్ విందు

కాంగ్రెస్ నేత సొక్కం రవి ఆధ్వర్యంలో వేడుక

సాలూరలో ఘనంగా ఇఫ్తార్ విందు

సాలూర మండల కేంద్రంలోని కటికె గల్లిలో గల పాత మసీదు ఆవరణలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సొక్కం రవి ఆధ్వర్యంలో బుధవారం ఇఫ్తార్ విందును  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మత సామరస్యాన్ని చాటిచెప్పారు. ఈ సందర్భంగా సొక్కం రవి మాట్లాడుతూ... సాలూర మండల కేంద్రం ఎప్పుడూ గంగా-జమున తెహజీబ్‌కు నిదర్శనమని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండడం సంతోషంగా ఉందని తెలిపారు. కటికె గల్లిలో మసీదు వద్ద జరిగిన ఈ ఆత్మీయ విందులో మసీదు కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఐక్యతను చాటారు. ఈ కార్యక్రమంలో సొక్కం ప్రశాంత్, అల్లే రమేష్, ఇల్తేపు రమేష్, కేజీ గంగారాం, బుద్ధె లక్ష్మణ్, నీరడి నాగేష్, కల్లూరి భాస్కర్, ముట్టన్ గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Views: 42
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు