గురుశిష్యుల ఆత్మీయ కలయిక.. చౌట్‌పల్లిలో పూర్వ విద్యార్థుల సందడి

గురుశిష్యుల ఆత్మీయ కలయిక.. చౌట్‌పల్లిలో పూర్వ విద్యార్థుల సందడి

అది వారు అక్షరాలు దిద్దిన ఆలయం.. క్రమశిక్షణ నేర్చుకున్న వేదిక. సరిగ్గా పాతికేళ్ల కిందట అదే పాఠశాల నుంచి పదో తరగతి పూర్తి చేసుకుని బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మళ్లీ ఇన్నాళ్లకు అదే ప్రాంగణంలో చిన్ననాటి స్నేహితులందరూ ఒకచోట చేరి సందడి చేశారు. కమ్మర్ పల్లి మండలంలోని చౌట్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2000-2001 విద్యా సంవత్సరం (SSC) పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. దశాబ్దాల క్రితం విడిపోయిన స్నేహితులందరూ ఒకే చోట చేరి తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

తమకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజంలో ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన నాటి ఉపాధ్యాయులను విద్యార్థులు భక్తిశ్రద్ధలతో గౌరవించుకున్నారు. ఉపాధ్యాయులను వేదికపైకి ఆహ్వానించి, పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఒకప్పటి విద్యార్థులు ఇప్పుడు వివిధ వృత్తుల్లో స్థిరపడినప్పటికీ, తమ గురువుల ముందు మాత్రం మళ్లీ పాత విద్యార్థులుగానే మారిపోయి ఆశీస్సులు తీసుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులతో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

IMG-20260308-WA0128

Views: 635
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు