చందూర్ బీసీ హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలి
చందూర్ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతిగృహ వార్డెన్ కల్పలతపై తక్షణమే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఫ్రంట్ ఆధ్వర్యంలో బుధవారం బోధన్ ఆర్‌డీఓ విజయ కుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.బాల్‌రాజ్ మాట్లాడుతూ.. ఈ నెల 11వ తేదీన చందూర్ బీసీ వసతి గృహంలో వార్డెన్ కల్పలత విద్యార్థులపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తూ తీవ్రస్థాయిలో అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. అనవసరంగా నిందలు వేస్తూ దాదాపు 10 మంది విద్యార్థులపై దౌర్జన్యంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ విద్యార్థులను భయాందోళనలకు గురిచేసిన వార్డెన్‌పై తక్షణమే విచారణ చేపట్టి నిజానిజాలను బయటకు తీసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌ఎఫ్ బోధన్ డివిజన్ నాయకులు పి. గణేష్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

