విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి : బోధన్ ఆర్డీఓ ఎం.విజయకుమారి

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి : బోధన్ ఆర్డీఓ ఎం.విజయకుమారి

గ్రామస్థాయి విద్యార్థులు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు సాధించేలా పాఠశాలల్లో విద్యను అందించాలని బోధన్ రెవెన్యూ డివిజినల్ అధికారిణి ఎం.విజయకుమారి పేర్కొన్నారు. గురువారం బోధన్ మండలం ఖండ్గావ్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఆమె అకస్మాత్తుగా సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన వసతులను, వంటశాలను పరిశీలించి, ఆహార నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో ముచ్చటించి, రాష్ట్ర ప్రభుత్వ మార్గనిర్దేశాలకు అనుగుణంగా బోధనా పద్ధతులు ఉండాలని సూచించారు. చిన్నతనం నుంచే గణితం, ఆంగ్ల మాధ్యమాల్లో నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారిలో ఉన్నత ఆశయాలపై స్ఫూర్తి నింపారు.

Views: 7
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు