అభివృద్ధి బాటలో మహిళల భాగస్వామ్యం అభినందనీయం : డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.రాజశ్రీ
By R.Suresh
On
నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ మాట్లాడుతూ... సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని, ఓర్పు, సహనం మరియు అంకితభావంతో పనిచేస్తూ నేడు ప్రభుత్వ శాఖలు అభివృద్ధి పథంలో పయనించేలా చేస్తున్నారని కొనియాడారు. మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించడం వల్లనే వారు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు విద్యార్థి దశ నుండే మహిళల పట్ల గౌరవం, విలువలతో కూడిన విద్యను అందించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పాలనాధికారి సుమంత్ కుమార్ డీఎంహెచ్‌ఓ ను శాలువాతో సత్కరించారు. అనంతరం కార్యాలయంలో సేవలందిస్తున్నమహిళా ఉద్యోగులందరికీ డీఎంహెచ్‌ఓ, పాలనాధికారి చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వెంకటేష్, డాక్టర్ శ్రావ్య, డాక్టర్ ప్రవీణ్, కార్యాలయ సూపరిండెంట్ పద్మ, సూర్యనారాయణ, డిపిఓ విశాల, డిహెచ్ఈలు ఘనపూర్ వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, నాగరాజు, సురేష్, హనుమాన్లు, రాము, వినోద్, సందీప్, సుమ, సృజన, చందన, అనురాధ, గంగమణి, రేఖ, సంధ్యతో పాటు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Views: 117
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

