సీపీఎస్‌ను రద్దు చేసి.. పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలి

నల్ల బ్యాడ్జీలతో TGEJAC నిరసన.. సెప్టెంబరు 10 మహాధర్నాకు పిలుపు

సీపీఎస్‌ను రద్దు చేసి.. పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలి

ఉద్యోగుల పాలిట గుదిబండగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఎన్జీవోల ఐక్య కార్యాచరణ సమితి జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ డిమాండ్ చేశారు. సెప్టెంబరు 1ని పెన్షన్ విద్రోహ దినంగా పరిగణిస్తూ టీజీఈజేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సుమన్ కుమార్ మాట్లాడుతూ... 2004 తర్వాత ప్రభుత్వ సర్వీసులో చేరిన ఉద్యోగులందరికీ పాత పెన్షన్ వర్తించే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు 10న హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ భాగస్వామ్య సంఘాల నాయకులు రమేష్, శ్రీకాంత్, ప్రవీణ్, జమీలుల్లా, ధర్మేందర్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, నాయకులు సతీష్, నాగరాజు, సంజీవయ్య, పద్మ, సునీత, విజయలక్ష్మి, గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-09-01 at 5.46.10 PM (1)

Views: 56
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు