సురక్షిత వలసలపై అవగాహన పెంపొందించుకోవాలి
By R.Suresh
On
వలస వెళ్లేవారు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని ఎన్‌డబ్ల్యూడబ్ల్యూటీ-ఐఓఎం ప్రాజెక్ట్ బృందం సూచించింది. శనివారం నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని బాబాపూర్ గ్రామంలో మొబైల్ మైగ్రేషన్ రిసోర్స్ వ్యాన్ ద్వారా కమ్యూనిటీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలు మరియు వలస కుటుంబాలకు వివిధ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.
పథకాలపై అవగాహన..
కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న లేబర్ కార్డుల ప్రయోజనాలను బృందం సభ్యులు వివరించారు. కార్డుల దరఖాస్తు ప్రక్రియతో పాటు, పీఎంజేజేవై (PMJJY), పీఎంఎస్‌బీవై వంటి బీమా పథకాలు ఆపద కాలంలో కుటుంబాలకు ఎలా అండగా ఉంటాయో తెలియజేశారు. యువత, మహిళల ఉపాధి కోసం అందుబాటులో ఉన్న నైపుణ్య శిక్షణ వివరాలను వెల్లడించారు.
'ప్రవాసి హెల్ప్‌లైన్'ను వినియోగించుకోవాలి
వలస వెళ్లేవారు ఎమిగ్రేట్ యాప్‌ను వినియోగించాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే 1800 599 1393 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని కోరుతూ పోస్టర్లను ప్రదర్శించారు. వాతావరణ మార్పులు, మానసిక సామాజిక అంశాలపై గ్రామస్థుల సందేహాలను నివృత్తి చేశారు. వలస కుటుంబాల సంక్షేమానికి ఇలాంటి సదస్సులు ఎంతో దోహదపడతాయని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ నుండి వచ్చిన ప్రాజెక్ట్ సభ్యులు బాలకృష్ణ, వంశీ, శివ, గ్రామస్థులు పాల్గొన్నారు.

Views: 10
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

