నవీపేట్ మండలంలో ప్రారంభానికి సిద్ధంగా హనుమాన్ ఫామ్ విద్యుత్ ఉపకేంద్రం
సాంకేతిక తనిఖీలు పూర్తి.. సబ్‌స్టేషన్ టెక్నికల్ చార్జ్
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం హనుమాన్ ఫామ్ గ్రామంలో టీజీ ఎన్పీడీసీఎల్ నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం సాంకేతిక పరీక్షలు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. టీజీ ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ చౌహాన్ జై వంతు రావు, జిల్లా ఎస్‌ఈ పీవీ రాజేశ్వరరావులు ఉపకేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, సాంకేతిక తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి లోపాలు లేవని నిర్ధారించిన అనంతరం ఉపకేంద్రాన్ని విజయవంతంగా టెక్నికల్ చార్జ్ చేశారు.
ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ మాట్లాడుతూ... ఈ నూతన ఉపకేంద్రం ప్రారంభం కావడం ద్వారా పోతంగల్, హనుమాన్ ఫామ్ గ్రామాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వ్యవసాయ మరియు గృహ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు. లో-వోల్టేజీ సమస్యలు తప్పుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ ఆపరేషన్ పీవీ రాజేశ్వరరావు, డీఈ ఆపరేషన్ ఎం. శ్రీనివాసరావు, డీఈ ఎంఆర్‌టీ/కన్స్ట్రక్షన్ డి.వెంకటరమణ, ఈఈ సివిల్ స్వామి, ఏడీఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్, ఏడీఈ ఆపరేషన్ జి. ప్రశాంత్ రెడ్డి, ఏడీఈ టీఆర్‌ఈ కె.నటరాజ్, ఏఈ కన్స్ట్రక్షన్ బోధన్ ఏ. కాశీనాథ్, ఏఈ ఆపరేషన్ ఆనంద్, జానపేట ఏఈ జి. శ్రీనివాస్, ఏఈ ప్రొటెక్షన్ భాస్కర్ ప్రసాద్, సీనియర్ లైన్‌స్పెక్టర్ నరేందర్ నాయక్, ఎంఆర్‌టీ మరియు స్థానిక ఆపరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


