సమాజ హితమే మీడియా లక్ష్యం కావాలి : సీపీ పి.సాయిచైతన్య
By R.Suresh
On
ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాది అత్యంత కీలకమైన పాత్రని, సమాజ హితాన్ని కాంక్షిస్తూ వార్తలను ప్రచురించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. శుక్రవారం నగరంలో డీడీ9 వార్త దినపత్రిక క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాస్తవాలను నిర్భయంగా, నిష్పక్షపాతంగా ప్రజల ముందుంచినప్పుడే మీడియాకు పాఠకుల నుంచి ఆదరణ లభిస్తుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు యంత్రాంగానికి మీడియా సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడంలో, సామాజిక అంశాలపై చైతన్యం తీసుకురావడంలో పత్రికలు కీలక భూమిక పోషించాలని సూచించారు. అనంతరం డీడీ9 వార్త యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందిస్తూ.. పత్రిక మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో డీడీ9 వార్త నిజామాబాద్ ఇంచార్జి ఢాకా దుర్గప్రసాద్, బోధన్ డివిజన్ ఇంచార్జి సురేష్, స్వామి పాల్గొన్నారు.
Views: 128
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

