బోధన్‌లో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన సీపీ సాయి చైతన్య
ఓటర్లకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశం
By R.Suresh
On
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా బోధన్ పట్టణంలో పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. బుధవారం జరగనున్న పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. మంగళవారం పట్టణంలోని ధ్యాకం గల్లి, గ్రామచావిడి, శకర్ నగర్‌లోని మధుమలాంచ హైస్కూల్, బస్తీ దవాఖానల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన అంగుళం అంగుళం పరిశీలించారు.
కేంద్రాల వద్ద బందోబస్తు తీరును పరిశీలించిన సీపీ, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల వేళ ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేలా భరోసా కల్పించాలి. పోలింగ్ కేంద్రాల వద్ద అనవసరంగా గుమిగూడే వారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సిబ్బంది తమ విధులను నిక్కచ్చిగా నిర్వహిస్తూనే, ఓటర్ల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సీపీ సూచించారు.
-
వృద్ధులకు, దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలి.
-
ఓటు వేయడానికి వచ్చే సామాన్య ప్రజలకు తగిన మార్గదర్శనం చేస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను చాటిచెప్పాలని అధికారులను కోరారు.
ఈ తనిఖీల్లో సీపీ వెంట బోధన్ ఏసీపీ పి.శ్రీనివాస్, సీఐడీ ఏసీపీ రఘునాథ్, బోధన్ ఎస్‌హెచ్‌ఓ వెంకట్ నారాయణ, రుద్రూర్ సీఐ శ్రీకృష్ణ, సీసీఆర్‌బీ సీఐ రమేష్, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డితో పాటు ఎన్నికల పరిశీలకులు ఉన్నారు.
Views: 13
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

