జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు ఏప్రిల్ 30 వరకు పెంపు
By R.Suresh
On
తెలంగాణలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్రిడిటేషన్ నిబంధనలపై తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ మేరకు ముందడుగు వేసింది. జర్నలిస్టుల వృత్తి కార్యకలాపాలకు, సౌకర్యాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ గడువును పెంచుతున్నట్లు ప్రభుత్వం కోర్టుకు వివరించగా, దీనిని రికార్డుల్లోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ నిర్ణయం తాత్కాలిక ఊరట మాత్రమేనని, జర్నలిస్టులకు పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని జర్నలిస్ట్ సంఘాల నేతలు స్పష్టం చేశారు.
Views: 29
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

