గంజాయిపై ఉక్కుపాదం మోపాలి: మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమేర్

మత్తు కోరల్లో చిక్కి.. భవిష్యత్తును చిదిమేసుకోవద్దు

గంజాయిపై ఉక్కుపాదం మోపాలి: మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమేర్

గంజాయి నషాలో పడి యువత తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమర్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం బోధన్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజానికి వెన్నెముక లాంటి యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవడం విచారకరమని పేర్కొన్నారు. గంజాయి మహమ్మారి యువతను శారీరకంగా, మానసిక దృఢత్వాన్ని కోల్పోయేలా చేస్తోందని, తద్వారా వారు నేర ప్రవృత్తి వైపు మళ్లుతున్నారని హెచ్చరించారు.

పోలీసులు ప్రత్యేక చొరవ చూపాలి

పట్టణంలోని పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని, దీనిని అరికట్టేందుకు జిల్లా, బోధన్ పోలీసు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని షకీల్ ఆమేర్ కోరారు. పోలీసులు నిరంతరం నిఘా ఉంచి, విక్రయదారులు మరియు సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని,  విద్యాసంస్థల పరిసరాల్లో గంజాయి లభ్యం కాకుండా ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టాలని సూచించారు. గంజాయి రహిత బోధన్‌ను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని పిలుపునిచ్చారు. యువత మత్తుకు దూరంగా ఉండి, చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

Views: 35
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు