అంతర్రాష్ట్ర బైక్‌ దొంగల ముఠా అరెస్ట్‌

17 మోటార్‌ సైకిళ్లు స్వాధీనం.. 15 కేసుల ఛేదన

అంతర్రాష్ట్ర బైక్‌ దొంగల ముఠా అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన నిజామాబాద్‌ సీపీ సాయి చైతన్య

నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో వరుస బైక్‌ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. బుధవారం నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ పి. సాయి చైతన్య కేసు వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ. లక్షల విలువైన 17 పల్సర్‌ బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
మహారాష్ట్ర ముఠా ఆగడాలు..
మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌, నాయగావ్‌ ప్రాంతాలకు చెందిన షేక్‌ అర్బజ్‌ @ మాయ, షేక్‌ ఆరిబ్‌, షేక్‌ రెహమాన్‌, షేక్‌ ఇమ్రాన్‌ మరికొందరితో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. గత రెండేళ్లుగా వీరు నిజామాబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దుల్లోని బాసర, భైంసా, తానూర్, నవీపేట్, వర్ని ప్రాంతాల్లో పర్యవేక్షిస్తూ.. ప్రజలు అప్రమత్తంగా లేని సమయాల్లో పల్సర్‌  వాహనాలను దొంగిలిస్తున్నారు. దొంగిలించిన బైకులను బాసర, ధర్మాబాద్‌కు చెందిన రిసీవర్లకు తక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
పోలీసుల నిఘా..
మంగళవారం సాయంత్రం నవీపేట్‌ మండలంలోని అయ్యప్ప గుడి వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా వస్తున్న నిందితులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు చాకచక్యంగా వెంబడించి పట్టుకున్నారు. వారిని విచారించగా వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని 15 దొంగతనం కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు షేక్‌ అర్బజ్‌పై గతంలోనూ 10 కి పైగా దొంగతనం, చైన్‌ స్నాచింగ్‌ కేసులు ఉన్నట్లు సీపీ వివరించారు.
సిబ్బందికి అభినందనలు
ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ఏసీపీ ప్రకాష్ యాదవ్, సీసీఎస్‌ ఏసీపీ మస్తాన్ అలీ, నార్త్ రూరల్ సీఐ బి. శ్రీనివాస్, నవీపేట్ ఎస్‌ఐ కె. శ్రీకాంత్ మరియు క్రైమ్ పార్టీ సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
Views: 51
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు