విద్యార్థులు భావి భారత పౌరులుగా ఎదగాలి : సాలూర ఎంఈఓ రాజీ మంజుష

సాలూర జడ్పీ పాఠశాలలో ఘనంగా పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

విద్యార్థులు భావి భారత పౌరులుగా ఎదగాలి : సాలూర ఎంఈఓ రాజీ మంజుష

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు, యోగా విన్యాసాలు

విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సాలూర మండల విద్యాశాఖ అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజీ మంజుష పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం వైభవంగా జరిగింది. తొమ్మిదో తరగతి విద్యార్థులు తమ సీనియర్లకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం సందడిగా సాగింది. ఈ సందర్భంగా ఎంఈఓ రాజీ మంజుష మాట్లాడుతూ.. విద్యార్థి దశ అనేది జీవితానికి పునాది వంటిదని, ఈ సమయంలో మంచి అలవాట్లు, క్రమశిక్షణ కలిగి ఉంటేనే సమాజంలో గౌరవప్రదమైన స్థానానికి చేరుకుంటారని పేర్కొన్నారు.రాబోయే పదవ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులందరూ శ్రమించి చదివి, వంద శాతం ఫలితాలతో పాఠశాల పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు. అంతకుముందు, పాఠశాల విద్యార్థుల గ్రూప్ కమిటీ లీడర్లకు లీడర్ బ్యాడ్జీలు అలంకరించి వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు, యోగా ప్రదర్శనలు ఆహుతులను కట్టిపడేశాయి. ఈ వేడుకలో ఉపాధ్యాయులు విజయ్ కుమార్, శోభారాణి, సుధారాణి, విజయలక్ష్మి, జ్యోత్స్న, అరుణ్ కుమార్, లక్ష్మీ, అబ్బయ్య, స్వామి కాముని, సంగీతరావు, రుద్ర సంతోష్ యాదవ్, విఠల్ కాంబ్లే, గందం సాయిలు, దండు రాజ్ కుమార్, రవి, వనజ, స్వర్ణ పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారత్నం, ఉపాధ్యాయులు శశికళ, ఆశ, అపర్ణ, శౌరి రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించారు.
1
Views: 56
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు