కుమ్మన్ పల్లిలో ఘనంగా హోలీ సంబరాలు : హోరాహోరీగా కుస్తీ పోటీలు

కుమ్మన్ పల్లిలో ఘనంగా హోలీ సంబరాలు : హోరాహోరీగా కుస్తీ పోటీలు

నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్ పల్లి గ్రామంలో హోలీ పండుగ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామస్తులందరూ రంగులు చల్లుకుంటూ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ పండుగను పురస్కరించుకొని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుస్తీ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో మల్లయోధులు తరలివచ్చారు. హోరాహోరీగా సాగిన ఈ కుస్తీల్లో మల్లయోధులు తమ బలాబలాలను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు గ్రామ పెద్దలు నగదు పురస్కారాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజ్ పటేల్, గ్రామ సర్పంచ్ శీలం మహేందర్ రెడ్డి, విడిసి అధ్యక్షులు తోకల అంజయ్య, గ్రామ పెద్దలు రాహుల్ రెడ్డి, హనుమంత్ రెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొని వేడుకలను జయప్రదం చేశారు.

 

Views: 79
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు