సాలూర మండలంలో జోరుగా అక్రమ ‘ఇసుక’ రవాణా !

కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశించినా పట్టించుకోని స్థానిక అధికారులు

సాలూర మండలంలో జోరుగా అక్రమ ‘ఇసుక’ రవాణా !

సాలూర మండలం దాటి వెళ్తున్న వాహనాలను పట్టుకున్న బోధన్ తహసీల్దార్

మంజీరా నది పరివాహక ప్రాంతం అక్రమార్కులకు కామధేనువుగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలో ఇసుక దోపిడీ మూడు పువ్వులు ఆరు كాయలుగా వర్ధిల్లుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, స్థానిక ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి కఠినంగా వ్యవహరించాలని పదే పదే ఆదేశాలు జారీ చేస్తున్నా, స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ‘చూసీ చూడనట్లు’ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని ఖాజాపూర్, హున్సా, మందర్న గ్రామాల్లోని మంజీరా నది నుంచి ప్రతిరోజూ ఉదయం, రాతి వేళల్లో నిత్యం 50కి పైగా ఆటోలు, ట్రాక్టర్లలో ఇసుక దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. కళ్లెదుటే ఇంత పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కళ్ల ముందే వెళ్తున్నా... నిమ్మకు నీరెత్తినట్లు!

సాలూర మండల అధికారులు నిజామాబాద్ నుంచి విధులకు వస్తున్న సమయంలోనూ, తిరిగి వెళ్తున్న సమయంలోనూ వారి కళ్ల ముందే ఇసుక వాహనాలు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. నిత్యం తాము తిరిగే మార్గంలోనే అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు కనీసం వాహనాలను ఆపి తనిఖీ చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి నుంచి ఇసుక అక్రమంగా సాలూర మండలం దాటి వెళ్తుంటే, పక్కనే ఉన్న బోధన్ మండల తహసీల్దార్ నిన్న రాత్రి ఆ వాహనాలను పట్టుకోవాల్సి వచ్చింది. మంజీరా నదికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే బోధన్ తహసీల్దార్ నిఘా పెట్టి ఇసుక వాహనాలను సీజ్ చేస్తుంటే, నిత్యం సాలూర మండల కేంద్రం గుండానే వాహనాలు తిరుగుతున్నా ఇక్కడి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఉన్నతాధికారులు స్పందించాలి..

సాలూర మండల కేంద్రం గుండానే ఈ ఇసుక రవాణా సాగుతున్నా అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వెనుక స్థానిక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్, ఎమ్మెల్యేల ఆదేశాలను సైతం తుంగలో తొక్కుతూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని మంజీరా తీర ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

ఈ వ్యవహారంపై వివరణ కోరగా... 

అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక  తహసీల్దార్ అజ్మత్ నవాజ్   తెలిపారు. 

IMG_20260517_001139

Views: 106
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు