పొతంగల్‌లో శివాజీ సేన యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
By R.Suresh
On
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం పొతంగల్‌లో శివాజీ సేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం నవీపేట్ ఎస్సై శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో బాటసారుల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. యువత ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం గొప్ప విషయమని, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. ప్రజలకు, ముఖ్యంగా ప్రయాణికులకు ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పొతంగల్ ఉప సర్పంచ్ సతీశ్, శివాజీ సేన యూత్ సభ్యులు సౌద శ్రీను, సౌదా మల్లయ్య, వినోద్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Views: 26
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

