జిల్లా ఉన్నతాధికారుల చేతుల మీదుగా ‘DD9 వార్త’ క్యాలెండర్ ఆవిష్కరణ

జిల్లా ఉన్నతాధికారుల చేతుల మీదుగా ‘DD9 వార్త’ క్యాలెండర్ ఆవిష్కరణ

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డీడీ9 వార్త దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. గనులు మరియు భూగర్భ శాఖ సహాయ సంచాలకులు జి.సంజయ్ కుమార్, అదే శాఖకు చెందిన సూపరింటెండెంట్ గోవర్ధన్, భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ మరియు డిజిడబ్ల్యుఓ పి.శ్రీనివాస బాబులతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఈ ఆవిష్కరణలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సమాజ హితం కోసం పనిచేసే పత్రికలు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లాలో డీడీ9 వార్త దినపత్రిక తనదైన శైలిలో వార్తలను అందిస్తూ ప్రజల ఆదరణ పొందాలని వారు ఈ సందర్భంగా పత్రికా యాజమాన్యానికి, ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతాయుతమైన జర్నలిజంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు సూచించారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఇంచార్జి ఢాకా దుర్గా ప్రసాద్, శివ కుమార్ ఘర్కా తదితరులు పాల్గొన్నారు.

19

20

Views: 25
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు