సాలూర పీఆర్‌టీయూ అధ్యక్షుడిగా కల్లూర్ శంకర్
ప్రోగ్రెసివ్ రికగ్నిజ్ టీచర్స్ యూనియన్ సాలూర మండల నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హోరాహోరీగా సాగిన అధ్యక్ష పదవి పోటీలో కల్లూర్ శంకర్ డ్రా పద్ధతి ద్వారా విజయం సాధించగా, మిగిలిన పదవులన్నింటికీ బాధ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శిగా సింగారి లక్ష్మణ్, అసోసియేట్ అధ్యక్షులుగా జి.గోవర్ధన్, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలుగా డి.సుధారాణి బాధ్యతలు చేపట్టారు. ఉపాధ్యక్షులుగా ఎండి.ఫక్రుద్దీన్, మహిళా ఉపాధ్యక్షురాలుగా కె.జ్యోతి, కార్యదర్శిగా కె.శ్రీనివాస్, మహిళా కార్యదర్శిగా టి.ప్రమీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల కార్యక్రమానికి పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షులు పి.మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రచార కమిటీ కన్వీనర్ జి.రవీందర్ రెడ్డి, మాజీ బోధన్ డివిజన్ అధ్యక్షులు ఎ.శంకర్, బోధన్ అధ్యక్షులు థామస్, పోతంగల్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బోధన్ అర్బన్ అధ్యక్షులు కైరాన్, ప్రధాన కార్యదర్శి గంగాధర్ తో పాటు వివిధ మండలాల కార్యవర్గ సభ్యులు, సాలూర మండల ప్రాథమిక సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు సంఘ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

