నిజామాబాద్ లో ఘనంగా కవిత పుట్టినరోజు వేడుకలు

నిజామాబాద్ లో ఘనంగా కవిత పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలను శుక్రవారం జిల్లా కేంద్రంలోని జాగృతి కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేక్‌ కట్‌ చేసి పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. కవిత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి రావు మాట్లాడుతూ.. సామాజిక, సాంస్కృతిక రంగాల్లో కవిత చేస్తున్న కృషి ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో అడక్ కమిటీ సభ్యులు అంబటి శ్రీనివాస్ గౌడ్, ఇరుముల శంకర్, తెలంగాణ శంకర్, దొంతు ప్రవీణ్, హన్మాండ్లు, సంతోష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

 

Views: 87
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు