రాయల సుభాష్ చంద్రబోస్ ఆశయాలను కొనసాగిద్దాం

రాయల సుభాష్ చంద్రబోస్ ఆశయాలను కొనసాగిద్దాం

విప్లవోద్యమ ప్రస్థానంలో నిబద్ధత కలిగిన నేతగా పనిచేసిన కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) 10వ వర్ధంతిని బోధన్ పట్టణం హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద  సోమవారం ఘనంగా నిర్వహించారు. సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి.మల్లేష్ మాట్లాడుతూ... రవన్న జీవితం విప్లవోద్యమానికి అంకితమని, ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. అతివాద, మితవాద ధోరణులు కాకుండా ప్రజా పంథా మార్గమే పేద ప్రజల సమస్యల పరిష్కారానికి సరైనదని ఆయన నమ్మేవారని ఆ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోధన్ మండల కార్యదర్శి పడాల శంకర్, ఏఐపీకేఎంఎస్ జిల్లా నాయకులు సీతారాం, సిహెచ్ రమేష్, టి.లాలయ్య, చంద్రకాంత్, సోంబాలయ్య, ఏ.గంగారాం, బండారి శంకర్, కృష్ణ, తులసమ్మ, సావిత్రి, గంగామణి తదితరులు పాల్గొన్నారు.

Views: 26
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు