రేపే నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ పోలింగ్ : నిర్భయంగా... ఓటేద్దాం
4 మున్సిపాలిటీలు.. 146 వార్డులు.. 714 మంది అభ్యర్థులు - రంగంలోకి 4.95 లక్షల మంది ఓటర్లు
By R.Suresh
On
సమస్యాత్మక కేంద్రాలపై గట్టి నిఘా: సీపీ సాయి చైతన్య - సజావుగా సాగేలా ఏర్పాట్లు పూర్తి చేశాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి
ప్రజాస్వామ్య పండుగకు వేళయింది. నిజామాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో బుధవారం పోలింగ్ జరగనుంది. ఓటరు దేవుళ్లు తమ ప్రతినిధులను ఎన్నుకునేందుకు సర్వం సిద్ధమైంది. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తం కానుంది. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ప్రజలకు పిలుపునిచ్చారు.
జిల్లా వ్యాప్తంగా 729 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రానికే పంపిణీ కేంద్రాల నుంచి పోలింగ్ సామాగ్రిని బస్సుల ద్వారా ఆయా కేంద్రాలకు తరలించారు. 4,375 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1,370 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు.
-
మొత్తం ఓటర్లు: 4,95,000
-
పోలింగ్ కేంద్రాలు: 729
-
పోలింగ్ సిబ్బంది: 4,375 మంది
-
పోలీస్ బలగాలు: 1,370 మంది పోలీసులు + 3 సాయుధ ప్లాటూన్లు
-
సమయం: ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. (క్యూ లైన్‌లో ఉన్నవారికి చివరి నిమిషం వరకు అవకాశం).
-
గుర్తింపు: ఓటరు స్లిప్పుతోపాటు 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరి.
-
నిషేధం: పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు.
-
నిఘా: సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.
బుధవారం పోలింగ్ ముగియగానే బ్యాలెట్ పెట్టెలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తారు. 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం 16న మేయర్, చైర్మన్ల ఎన్నికకు సంబంధించి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు.
Views: 21
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

