బోధన్ ఉషోదయ విద్యాసంస్థల్లో మెగా జాబ్ మేళా

277 మందికి ఉద్యోగ అవకాశాలు

బోధన్ ఉషోదయ విద్యాసంస్థల్లో మెగా జాబ్ మేళా

బోధన్ పట్టణంలోని ఉషోదయ విద్యాసంస్థల ఆధ్వర్యంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సహకారంతో బోధన్‌లోని ఉషోదయ డిగ్రీ కళాశాల వేదికగా గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిరుద్యోగ యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ జాబ్ మేళాలో 11 ప్రముఖ కంపెనీల హెచ్‌ఆర్ ప్రతినిధులు పాల్గొని, అభ్యర్థుల ప్రతిభను పరిశీలించారు. మొత్తం 423 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాగా, వారిలో 277 మందిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్ సూర్యప్రకాష్, ఆయా కంపెనీల ప్రతినిధుల చేతుల మీదుగా ప్రొవిజనల్ ఆఫర్ లెటర్లను అందజేశారు.
అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి : సూర్యప్రకాష్ 
ఈ సందర్భంగా ఉషోదయ కళాశాల చైర్మన్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం హైదరాబాద్ లేదా ఇతర నగరాలకు తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ పట్టణానికే కంపెనీలను రప్పించి ఇక్కడ జాబ్ మేళా నిర్వహించాం. ప్రారంభంలో వేతనం కంటే ఆ ఉద్యోగంలో మీరు నేర్చుకునే నైపుణ్యాలు మీ అంకితభావం, క్రమశిక్షణే భవిష్యత్తులో మీకు మంచి ఆర్థిక అవకాశాలను అందిస్తాయి. రిమోట్ ఏరియాలో ఉన్న విద్యార్థులకు సైతం తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తూ, ఉపాధి కల్పించడమే మా సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌ఆర్ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. నేటి జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులకు మంచి వేతన ప్యాకేజీలు అందించాలని కోరారు. సంస్థ తరపున ఎల్లప్పుడూ సహకారం అందిస్తున్న టాస్క్ ప్రతినిధులు రఘు, లక్ష్మణ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీల ప్రతినిధులను ఉషోదయ విద్యాసంస్థల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో ఉషోదయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, అధ్యాపకులు హరికృష్ణ, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 12

Views: 13
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు