ఆర్గుల్ పంప్ హౌస్ వద్ద మిషన్ భగీరథ సిబ్బంది ధర్నా

ఆర్గుల్ పంప్ హౌస్ వద్ద మిషన్ భగీరథ సిబ్బంది ధర్నా

తమకు రావాల్సిన ఎనిమిది నెలల వేతన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్గుల్ పంప్ హౌస్ వద్ద మిషన్ భగీరథ లైన్మెన్లు, పంప్ ఆపరేటర్లు గురువారం ఆందోళనకు దిగారు. గత ఎనిమిది నెలలుగా జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారమైందని, అప్పులు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా జలాల్‌పూర్, బాల్కొండ ప్రాంతాలకు వెళ్లే పంపింగ్‌ను సిబ్బంది నిలిపివేయడంతో ఆయా గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది.

​ఈ సందర్భంగా లైన్మెన్లు బట్టు స్వామి, శ్రవణ్, రాములు, ఉపేందర్ తదితరులు మాట్లాడుతూ.. రేయింబవళ్లు కష్టపడి ప్రజలకు తాగునీరు అందిస్తున్న తమపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం తగదన్నారు. తక్షణమే పెండింగ్ నిధులు విడుదల చేసి తమను ఆదుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించే వరకు పంపింగ్ పునరుద్ధరించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు.

 

Views: 10
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు