బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ మార్గం ఆదర్శనీయం : బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ మార్గం ఆదర్శనీయం : బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

బంజారాల ఆరాధ్య దైవం, ఆధ్యాత్మిక గురువు సద్గురు సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ సమాజ శ్రేయస్సు కోసం చూపించిన మార్గం ఎంతో ఆదర్శనీయమని ప్రభుత్వ ముఖ్య సలహాదారు మరియు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కొనియాడారు. ఆదివారం బోధన్ పట్టణంలోని పెగడపల్లి రోడ్డులో గల రుద్ర కన్స్ట్రక్షన్ పక్కన బంజారాలకు కేటాయించిన స్థలంలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే, మహనీయుడి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సేవాలాల్ మహారాజ్ బోధించిన శాంతి, అహింస మరియు సామాజిక సంస్కరణలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. బంజారా సోదర సోదరీమణులందరికీ ఆయన జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సేవాలాల్ మహారాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. 

వేడుకల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, నూడా చైర్మన్ కేశ వేణు, బోధన్ మున్సిపల్ చైర్మన్ పద్మా శరత్ రెడ్డి, గంగా శంకర్, నాగేశ్వరరావులతో పాటు వివిధ శాఖల అధికారులు, బంజారా ప్రతినిధులు మరియు సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

IMG-20260308-WA0104

Views: 24
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు