హనుమన్నామ స్మరణలో ఇందూరు.. శోభాయాత్రకు పటిష్ట పహారా
1300 మంది పోలీసులతో భారీ బందోబస్తు - డ్రోన్ కెమెరాలు, ఇంటర్‌సెప్టర్ వాహనాలతో నిఘా నీడ
By R.Suresh
On
అన్ని ఏర్పాట్లు పూర్తి: సీపీ సాయి చైతన్య వెల్లడి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రేపు నిర్వహించనున్న హనుమాన్ జయంతి శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. భక్తజన సంద్రం మధ్య సాగే ఈ మహోత్సవం శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో సాగేలా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల వ్యాప్తంగా జరిగే శోభాయాత్రలు, అన్నదాన కార్యక్రమాలకు ఎక్కడా ఆటంకం కలగకుండా 1300 మంది సిబ్బందితో భారీ బందోబస్తును మోహరించినట్లు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు.
అణువణువూ నిఘా..
నగరంలోని సమస్యాత్మక ప్రాంతాలతో పాటు శోభాయాత్ర సాగే దారులన్నింటినీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
యాత్ర ఆద్యంతం డ్రోన్ కెమెరాలు, సీసీ టీవీల నిఘాలో ఉండనుంది. ఎత్తైన భవనాలపై నుండి బైనాక్యులర్లతో సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తారు.
భద్రతా వలయంలో భాగంగా కొత్తగా ఇంటర్‌సెప్టర్ వాహనాన్ని వినియోగిస్తున్నారు. పాత నేరస్తుల కదలికలపై నిఘాను మరింత పటిష్టం చేశారు.
ఏడు జిల్లాల బలగాల మోహరింపు
బందోబస్తు కోసం నిజామాబాద్ జిల్లా పోలీసులతో పాటు ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించారు. వీరికి తోడుగా టీఎస్ఎస్పీ బెటాలియన్లు, 20 స్పెషల్ పార్టీలు రంగంలోకి దిగాయి.
మత సామరస్యం కాపాడాలి
శోభాయాత్రలో పాల్గొనే భక్తులు, నిర్వాహకులు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ఎవరూ నమ్మవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ స్నేహభావంతో మెలిగి, పండుగను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Views: 13
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

