మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు నేరుగా ఖాతాల్లోనే జమ చేయాలి: ఐఎఫ్టీయూ డిమాండ్
By R.Suresh
On
మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు నేరుగా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు శివరాజ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రూపుల వారీగా వేతనాలు చెల్లించాలని తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, దీనివల్ల కార్మికుల మధ్య విభేదాలు రావడమే కాకుండా ఉపాధి భద్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు నష్టం చేకూర్చే ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకొని, గతంలో మాదిరిగానే వేతనాలను నేరుగా కార్మికుల ఖాతాల్లోనే వేయాలని ఆయన మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు.
Views: 12
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

