పీ.డీ.ఎస్.యు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముందస్తు అరెస్టు
By R.Suresh
On
పీ.డీ.ఎస్.యు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్‌ను శుక్రవారం ఉదయం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారు..
తాను ఉదయం వాకింగ్ చేసుకుంటున్న సమయంలో, ఎటువంటి ఆందోళనలకు పిలుపునివ్వకపోయినా పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని రాజేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగంలోని సమస్యలపై గళమెత్తే విద్యార్థి నేతలను ముందస్తు అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.రాష్ట్రంలో విద్యార్థుల పక్షాన నిలబడి ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఇలాంటి అణచివేత ధోరణి కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి తగిన మూల్యం తప్పదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
Views: 19
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

