పాలనాపరమైన మెళకువలు నేర్చుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి 

పాలనాపరమైన మెళకువలు నేర్చుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి 

వనరుల పెంపుదలపై దృష్టి పెట్టాలి : ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

14స్థానిక సంస్థల పాలనలో ప్రజా ప్రతినిధులు క్రియాశీలకంగా వ్యవహరించాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్‌లో నగర మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపల్ చైర్‌పర్సన్లకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాన్ని ఆమె, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు కేవలం పాలసీ మేకర్లు మాత్రమే కాదు, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించే ఎగ్జిక్యూటర్లు. మీ వార్డుకు మీరే సీఈవోలు. మీ పరిధిలోని ఆస్తులను, ట్రేడ్ లైసెన్స్‌లను సమర్థవంతంగా నిర్వహించి ఆదాయాన్ని పెంచుకోవాలి. రాజీవ్ గాంధీ ఆడిటోరియం వంటి ఆస్తులను ఆధునీకరించి, ఆదాయ వనరులుగా మార్చుకోవాలి. వార్డు వారీగా సమస్యలను గుర్తించి, పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే మీరు ఎన్నికయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. శానిటేషన్ సమస్యలపై అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారుల తీరును నా దృష్టికి తీసుకురండని కోరారు. ప్రజా ప్రతినిధులు మున్సిపల్ యాక్ట్ పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివి, పాలనాపరమైన నియమ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ఇచ్చే నిధులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రణాళికాబద్ధంగా ఆలోచించాలని, కరీంనగర్, వరంగల్ వంటి నగరాలతో పోటీ పడేలా నిజామాబాద్‌ను అభివృద్ధి చేయాలని నాయకులు సూచించారు. ఈ శిక్షణ శిబిరంలో మేయర్ ఉమారాణి, వివిధ మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు, కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.
16

Views: 9
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు