సాలూర మండల వీరశైవ లింగాయత్ సమాజ్ నూతన కమిటీ ఎన్నిక

సాలూర మండల వీరశైవ లింగాయత్ సమాజ్ నూతన కమిటీ ఎన్నిక

మండల కేంద్రమైన సాలూరలో వీరశైవ లింగాయత్ సమాజ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం నిర్వహించిన సమాజ సర్వసభ్య సమావేశంలో కుల బాంధవులందరి సమక్షంలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. సంఘం అధ్యక్షుడిగా ములీగే జై రామ్ పటేల్, ఉపాధ్యక్షుడిగా ఎన్నె గణపతి, కార్యదర్శిగా మాండే భీమ్ రావు, కోశాధికారిగా ఓల్లంకి అనిల్ బాధ్యతలు చేపట్టారు. సంఘం బలోపేతానికి, భవిష్యత్తు కార్యకలాపాలకు దిశానిర్దేశం చేసే సలహాదారులుగా చేన్నప్ప విజయ్ పటేల్, దడెన్ శంకర్, భుయ్యన్ శివరాజ్, బండే గంగాధర్, జున్నే సంజులను నియమించారు.

పాత కమిటీ సభ్యులకు ఘన సన్మానం : ఈ సందర్భంగా గత మూడేళ్లుగా సంఘం అభివృద్ధికి, కుల బాంధవుల ఐక్యతకు విశేష కృషి చేసిన పాత కమిటీ సభ్యులను నూతన కార్యవర్గం ఘనంగా సన్మానించింది. వారి సేవలను కొనియాడుతూ శాలువాలు కప్పిగౌరవించారు. అనంతరం నూతన అధ్యక్షులు ములీగే జై రామ్ పటేల్ మాట్లాడుతూ.. గత కమిటీ అందించిన స్ఫూర్తితో, పెద్దల సలహాలు పాటిస్తూ సమాజ అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, కుల బాంధవుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమాజ సభ్యులు, గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

Views: 191
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు