సాలూర తాత్కాలిక తహశీల్దార్ గా సురేందర్ నాయక్
By R.Suresh
On
సాలూర మండల తాత్కాలిక తహశీల్దార్ గా రుద్రూర్ ఉప తహశీల్దార్ సురేందర్ నాయక్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన తహశీల్దార్ శశిభూషణ్ వ్యక్తిగత కారణాల వల్ల సెలవుపై వెళ్లడంతో, అప్పటి నుంచి ఎడపల్లి ఉప తహశీల్దార్ అనూష తాత్కాలిక బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా ఆమె ఆ బాధ్యతల నుండి తప్పుకోవడంతో, పై అధికారుల ఆదేశాల మేరకు సురేందర్ నాయక్‌ను ఆ స్థానంలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన సోమవారం కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు.
Views: 46
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

