బంజారా మహిళ హత్యోదంతంపై నిందితులను కఠినంగా శిక్షించాలి

బంజారా మహిళ హత్యోదంతంపై నిందితులను కఠినంగా శిక్షించాలి

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో జరిగిన బంజారా మహిళ హత్యోదంతంపై అఖిల భారత బంజారా సేవా సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏఐబీఎస్ మండల అధ్యక్షుడు స్వామి నాయక్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏఐబీఎస్ మండల అధ్యక్షుడు స్వామి నాయక్ మాట్లాడుతూ.. సీతాయిపేట గ్రామానికి చెందిన కాంతిని అమానుషంగా హత్య చేయడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. నిందితులను గుర్తించి, వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. మహిళల రక్షణలో ప్రభుత్వం విఫలమైందని, దాడులు చేస్తున్న వారికి కనీస భయం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐబీఎస్ జిల్లా అధ్యక్షుడు మోహన్ నాయక్, డివిజన్ అధ్యక్షుడు శంకర్ నాయక్, నాయకులు మోహన్ నాయక్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 12
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు