హున్సాలో హోలీ పిడిగుద్దులాట.. గాయాలైనా వెనకడుగు వేయని నమ్మకం

హున్సాలో హోలీ పిడిగుద్దులాట.. గాయాలైనా వెనకడుగు వేయని నమ్మకం

నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హున్సా గ్రామంలో వందేళ్ల నాటి సంప్రదాయం పునరావృతమైంది. హోలీ పండుగను పురస్కరించుకుని ఏటా నిర్వహించే పిడిగుద్దులాట ఈసారి కూడా ఉత్సాహంగా సాగింది. బుధవారం ఉదయం నుంచే గ్రామస్తులు రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాల్లో మునిగితేలారు.
సాయంత్రం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన కుస్తీ పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం గ్రామ హనుమాన్ ఆలయం వద్ద గ్రామస్తులు పిడిగుద్దులాటకు సిద్ధమయ్యారు.
గ్రామ పెద్దల పర్యవేక్షణలో కర్ర స్తంభాలు పాతి, తాడును గట్టిగా బిగించారు. ఆట నిబంధనల ప్రకారం గ్రామస్తులు ఒక చేతితో తాడును పట్టుకుని, మరో చేతి పిడికిలితో ప్రత్యర్థులపై గుద్దులు కురిపించారు. ఈ క్రమంలో దెబ్బలు తగిలి రక్తాలు కారినా గ్రామస్తులు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.
కామదహనంలోని బూడిదను గాయాలపై రాసుకుంటే నొప్పులు తెలియవని, త్వరగా మానిపోతాయని వారి ప్రగాఢ విశ్వాసం. సుమారు పది నిమిషాల పాటు సాగిన ఈ రసవత్తర పోరాటాన్ని గ్రామ పెద్దలు తాడు వదిలివేయడంతో ముగించారు. ఆట ముగిసిన వెంటనే ఇరువర్గాల వారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకోవడం విశేషం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు.WhatsApp Image 2026-03-04 at 12.25.23 PM
Views: 27
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు