ఉగాది వేళ ఎరాజ్ పల్లిలో హోరాహోరీగా మల్లయుద్ధాలు

ఉగాది వేళ ఎరాజ్ పల్లిలో హోరాహోరీగా మల్లయుద్ధాలు

తెలంగాణ పల్లెల్లో ఉగాది పండుగ అంటేనే ఉత్సాహం.. ఆ ఉత్సాహానికి కుస్తీ పోటీలు తోడైతే ఆ మజాయే వేరు. బోధన్ మండలంలోని ఎరాజ్ పల్లి గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కుస్తీ పోటీలు అత్యంత హోరాహోరీగా సాగాయి. ఏటా ఉగాది నాడు కుస్తీలు నిర్వహించడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఈ పోటీల్లో తమ సత్తా చాటేందుకు వివిధ ప్రాంతాల నుంచి మల్లయోధులు భారీగా తరలివచ్చారు. యోధుల మధ్య సాగిన ఎత్తులకు పైఎత్తులు చూసి గ్రామస్తులు ఈలలు, కేకలతో మురిసిపోయారు.
​పోటీల్లో గెలుపొందిన మల్లయోధులకు గ్రామ సర్పంచ్ దాసు గౌడ్, గ్రామ పెద్దలు నగదు పురస్కారాలను అందజేసి అభినందించారు. అనంతరం బాజాభజంత్రీల నడుమ గ్రామంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించి హనుమాన్ మందిరానికి చేరుకున్నారు. అక్కడ పండితులచే పంచాంగ శ్రవణం గావించారు. కొత్త ఏడాదిలో గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 91
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు